నేడు విజయవాడకు సీఎం రాక

NTR: విజయవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్తారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు అక్కడ జరిగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7.05 గంటలకు ముఖ్యమంత్రి తమ ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.