కీలక నిందితుడు అరెస్ట్.. రూ.5.67 కోట్లు సీజ్

NLR: మముసునూరు కేంద్రంగా మనీ స్కాంకు పాల్పడ్డ కీలక నిందితుడు మహబూబ్ సుభాని, అతని అనుచరుడు బ్రహ్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. మహబూబ్ సుభానికి సంబంధించిన రూ. 5. 39 కోట్లు, బ్రహ్మయ్యకు సంబంధించిన రూ. 28.48 లక్షల నగదు సీజ్ చేసినట్టు తెలిపారు.