సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

JGL: జిల్లాలో భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ చట్టం-2025ను (భూమి హక్కుల రికార్డు) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 5,000 మంది లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ తెలిపారు. ఈనెల 17లోగా మీ సేవలో దరఖాస్తులను సమర్పించాలన్నారు.