'సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర'

SKLM: సమస్యలు పరిష్కారానికే పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హిరమండలం ఎస్సై ఎం.డి యాసిన్ తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలోని కొండరాగోలు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నారు. రహదారి ప్రమాదాలు నివారణకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.