రైతుల త్యాగానికి తగిన న్యాయం చేస్తాం: కలెక్టర్
SRPT: అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం భూములిచ్చిన రైతుల త్యాగం అమూల్యమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో రైతులతో జరిగిన సమావేశంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు, శ్మశానవాటిక మంజూరుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రాంతాభివృద్ధి జరుగుతుందని, రైతులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.