అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం

అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం

WGL: జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలా కుతలం చేస్తున్నాయి. వర్ధన్నపేట మండలం వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. వర్షం కురిసిన ప్రతిసారి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అనేక అగచాట్లు పడుతున్నట్లు ఆదివారం రైతులు తెలిపారు. తేమశాతం పై నిబంధనలు సడలించి కొనుగోల్లలో వేగం పెంచాలని రైతులు వేడుకుంటున్నారు.