VIDEO: రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలని ఆందోళన

బాపట్ల: దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయడాన్ని నిరసిస్తూ గురువారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు చల్లా రామయ్య బాపట్లలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కారు. రాష్ట్రవ్యాప్తంగా 1. 20 లక్షల పింఛన్లు, బాపట్ల జిల్లాలో 3,000 పింఛన్లు రద్దు చేశారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.