'అవినీతిపై విచారణ జరిపించాలి'

ATP: ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో 2023-24 నిర్వహించిన జాబ్ మేళాలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి, మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆ కళాశాల RJD నాగలింగారెడ్డికి వారు వినతి పత్రం అందించారు. కళాశాల అభివృద్ధి పనులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు.