సెలవుల్లో పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండండి: SP
GDWL: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు పాఠశాల సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని, ముఖ్యంగా బావులు, చెరువులు, కాలువల వంటి ప్రమాదకర ప్రాంతాలకు వారిని వెళ్లనివ్వకూడదని కోరారు. ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని, ఏమరపాటుగా ఉండకుండా అప్రమత్తంగా ఉండి తమ పిల్లలను కాపాడుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.