ఎయిర్‌పోర్టులో సంజూకు ఘన స్వాగతం
T20WCలో అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. కేరళ మంత్రి శివన్‌కుట్టి స్వయంగా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సంజూ ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. స్వరాష్ట్రానికి చేరుకున్న సంజూను చూసేందుకు వందలాది అభిమానులు ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు.