భారీ వర్షానికి కూలిన ఇల్లు

NRPT: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం ఉదయం దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన దుల్లకాడి రాములు అనే వ్యక్తి ఇల్లు కూలింది. చిన్నపాటి ఇల్లు కూలడంతో ప్రభుత్వం తనను ఆదుకోవాలని అలాగే, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ఎవరివైనా ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్లయితే తమకు తెలియజేయాలని గ్రామ కార్యదర్శులు కోరుతున్నారు.