VIDEO: ఇచ్చిన అప్పు అడిగినందుకు దాడి

PLD: పిడుగురాళ్ల సుందరయ్య కాలనీలో బ్రాహ్మణపల్లి ఆదామ్ షఫీ(35) అనే వ్యక్తిపై దాడి జరిగింది. అప్పులు తిరిగి అడిగినందుకు అమరలింగం, భాష, దావూద్, రిజ్వాను అనే వ్యక్తులు ఆదామ్ షఫీపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భర్తకు, తనకు ప్రాణహాని ఉందని ఆదామ్ షఫీ భార్య నాగూర్.బీ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.