ఎచ్చెర్ల సముద్రతీరానికి బంగ్లా మత్స్యకారులు

ఎచ్చెర్ల సముద్రతీరానికి బంగ్లా మత్స్యకారులు

AP: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన బోటు కొట్టుకువచ్చింది. అందులో 13 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా సంద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయి శ్రీకాకుళానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. 15 రోజులుగా సంద్రంలోనే ఉన్నట్లు వారు తెలిపారు.