అక్రమ లేఔట్ పై చర్యలు తీసుకోవాలని వినతి
MDK: మనోహరాబాద్ గ్రామపంచాయతీలో చేపట్టిన అక్రమ లే అవుట్ పై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు నిర్మల కుమార్ గౌడ్, శ్రీశైలం యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ ఆంజనేయులుకు వినతి పత్రం అందజేశారు. సర్వే నెంబర్ 725లో హెచ్ఎండిఏ, పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు చేసినట్టు ఆరోపించారు.