'ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి'
SRPT: ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇవాళ డీఈవో అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. వేసవి శిక్షణ పొందిన వారికి ఈఎల్స్, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి సీసీఎల్స్ మంజూరు చేయాలని. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ ఆయన కోరారు.