జిల్లాలో పవర్ కట్ ఉండకూడదు

JGL: జిల్లాలో పవర్ కట్ ఉండకూడదని విద్యుత్ శాఖ ఎస్ ఈ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల టౌన్ 2 సెక్షన్‌లోని సబ్ స్టేషన్‌ను పరిశీలించిన ఎస్ ఈ లాగ్ బుక్ లను పరిశీలించారు. అనంతరం విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.