VIDEO: బయటపడ్డ పాతకాలం నాటి విగ్రహాలు
NRML: కడెం మండలంలోని గంగాపూర్ పరిధిలోని దేవునిగూడెం శివారులో క్రీ.శ 9వ శతాబ్దం నాటి అతి పురాతన విగ్రహాలను కనుగొనడం జరిగిందని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రాజ్ కుమార్ తెలిపారు. ఇక్కడ 9వ శతాబ్దంలో రాష్ట్ర కూటులు, చాళుఖ్యులు, కాకతీయుల కాలంలో ఆలయం ఉండేదని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో దుర్గను పోలిన విగ్రహం, చామరదారిని, గణపతి, విగ్రహం, నంది ప్రతిమలు ఉన్నాయన్నారు.