'మెనూ ప్రకారం భోజనం అందించాలి'
BDK: దుమ్ముగూడెం మండలం కే. రేగుబల్లి బాలికల ఆశ్రమ పాఠశాల, కే గంగోలు, కొంగవాగు గుంపు జడ్పీ హైస్కూల్‌ను ఇవాళ ఆకస్మికంగా ఐటీడీఏ పీవో రాహుల్ తనిఖీ చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు. వారి చదువుకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత హెచ్ఎం, ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు.