VIDEO: బీడీ పెన్షన్ల కోసం ప్రజావాణిలో మహిళల వినతి
JGL: కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మహిళలు బీడీ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల ప్రజావాణికి వచ్చారు. అర్హులైనప్పటికీ తమకు పెన్షన్లు అందడం లేదని వాపోయారు. వెంటనే పరిశీలించి అర్హులందరికీ బీడీ పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను కోరారు. సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.