వెండితెరపైకి ఘంటసాల జీవితం
అమరగాయకుడు ఘంటసాల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఘంటసాల ది గ్రేట్' సినిమా విడుదలకు సిద్ధమైంది. సి.హెచ్.రామారావు దర్శకత్వంలో కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే లండన్, అమెరికాలో వేసిన ప్రివ్యూలకు అద్భుతమైన స్పందన వచ్చిందని మేకర్స్ తెలిపారు. ఈనెల 5న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.