వృద్ధుల సంక్షేమ పథకాలపై డైరెక్టర్ శైలజ తనిఖీ
JGL: రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ సంచాలకురాలు శైలజ జిల్లాలో పర్యటించి వృద్ధుల సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు. 'ప్రణామం' డే కేర్ సెంటర్, తారకరామనగర్ వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసి సదుపాయాలపై సమీక్షించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వృద్ధాశ్రమానికి అవసరమైన అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు.