బతుకమ్మ చీరలను చేన్లలో కట్టినం: MP నగేశ్
ADB: గత ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను పందులు, కోతులు రాకుండా చేనుల్లో కట్టామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఎద్దేవా చేశారు. బోథ్ పరిచయ గార్డెన్‌లో నిర్వహించిన ఇందిరా చీరల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. తాను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నానని గతంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసినప్పుడు ఎవరూ కట్టుకోలేదని, వాటిని దుర్గామాత టెంట్ వద్ద డెకరేషన్ కోసం వాడామని ఎంపీ పేర్కొన్నారు.