రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు సార్లు గ్రాండ్‌స్లమ్ విజేతగా నిలిచిన బోపన్న.. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ఆడాడు. 'నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు ఎలా వీడ్కోలు చెప్పాలి? మర్చిపోలేని రీతిలో 20 ఏళ్ల పాటు టెన్నిస్ కెరీర్‌లో కొనసాగిన తర్వాత ఇప్పుడు నా రాకెట్‌ను అధికారికంగా పక్కన పెట్టే సమయం వచ్చింది' అని పోస్ట్ చేశాడు.