తురకపాలెంలో పర్యటించిన మంత్రి

తురకపాలెంలో పర్యటించిన మంత్రి

GNTR: తురకపాలెంలో వరుస మరణాలు సంభవించడంతో శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గ్రామంలో పర్యటించారు. ఈ మరణాలకు గల కారణాలపై ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించారు. నీరు, మట్టి నమూనాలను సేకరించి, చనిపోయిన వారి అనారోగ్య కారణాలపై విచారణ జరుపుతున్నామని మంత్రి తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.