పెనుకొండలో ఉపాధ్యాయుల ధర్నా

పెనుకొండలో ఉపాధ్యాయుల ధర్నా

సత్యసాయి: పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసి ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని కోరారు. అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు హెచ్ఎం, ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు.