వైభవంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

వైభవంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

KDP: రాజంపేట మండలంలోని ఇసుకపల్లి గ్రామంలో గురువారం శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాజంపేట జనసేన పార్లమెంటు సమన్వయకర్త ఎల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేద పండితులు శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.