ఒకే బ్యాచ్‌.. ఒకే హోదా.. ఒకే రోజు పదవీ విరమణ!

ఒకే బ్యాచ్‌.. ఒకే హోదా.. ఒకే రోజు పదవీ విరమణ!

కేరళలో అరుదైన పరిణామం జరగబోతోంది. ఒకే బ్యాచ్.. ఒకే హోదాలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 14 మంది అధికారులు వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. అది కూడా 2026 మే 31 కావటం విశేషం. 71 ఏళ్ల రాష్ట్ర పశుసంవర్థక శాఖ చరిత్రలో ఇది చాలా అరుదైన పరిణామమని అధికారులు తెలిపారు. ఒకే కళాశాలకు చెందిన మేమంతా ఒకే రోజు రిటైర్ అవటం సంతోషంగా ఉందని వారు చెప్పారు.