గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: CI
ASF: గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని CI కుమారస్వామి అన్నారు. దహెగాం మండలం రాళ్లగూడ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా CI మాట్లాడుతూ.. క్రీడలు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడాలని ఆయన సూచించారు.