విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: కొండమల్లేపల్లి మండలం దంజిలాల్ తండా, చెన్నారం గ్రామంలో నిర్వహించిన శ్రీ బర్మస్వామి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ హాజరై, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.