వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NLG: జిల్లా కేంద్రంలో ఆదివారం నల్లగొండకు చెందిన కొప్పోలు వెంకట రామారావు కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవ వేడుకలకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.