హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినళ్లు

TG: రైళ్ల రద్దీ నేపథ్యంలో HYD మహానగరం చుట్టూ కొత్తగా మూడు భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ మూడు రైల్వే టెర్మినళ్లను ఔటర్‌కు, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది.