శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు
VZM: విజయనగరం గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ లెక్కింపులో హుండీ ఆదాయం రూ.72,272లు వచ్చింది. ఇది గడచిన శివరాత్రి యొక్క ఆదాయం అని ఈవో కే.వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి, అర్చకులు సోమశేఖర్ శర్మ పాల్గొన్నారు.