VIDEO: పోలీసుల పహారాలో చొంపి గెడ్డ

VIDEO: పోలీసుల పహారాలో చొంపి గెడ్డ

ASR: అరకులోయ మండలంలో కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షం కారణంగా గెడ్డలు, వాగులు ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని రాకపోకలు ఎక్కువగా ఉన్న చొంపి గెడ్డ వద్ద రాకపోకలను నిషేధిస్తూ పోలీసులు స్టాపర్లను ఏర్పాటు చేసి, రహదారికి అడ్డంగా తాళ్ళు కట్టారు. ఎవరూ గెడ్డలోకి దిగకుండా చూడటానికి పోలీసు సిబ్బంది విశ్వనాథం, కన్నంనాయుడు పహారకాస్తున్నారు.