US ప్రయాణాలపై తగ్గిన భారతీయుల మొగ్గు

US ప్రయాణాలపై తగ్గిన భారతీయుల మొగ్గు

పాతికేళ్ల తర్వాత తొలిసారి అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినడం దీనికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా ప్రకారం, అమెరికాను సందర్శించిన భారతీయుల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి జూన్‌లో 8%, జూలైలో 5.5% వరకు తగ్గింది.