పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య

NLR: పొందూరుకు చెందిన విష్ణువర్ధన్ రాజు(42) ముసునూరు రాంనగర్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తల్లికి కంటి చికిత్స జరగడంతో ఆమె కూతురి వద్దకు వెళ్లింది. సోమవారం ఆమె ఫోన్ చేయగా, సమాధానం ఇవ్వకపోవడంతో ముసునూరుకు వచ్చింది. విష్ణు ఉరేసుకుని కనిపించడంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. పెళ్లి కాకపోవడమే దీనికి కారణమని స్థానికులు చెప్తున్నారు.