మొక్కజొన్న కొనుగోలుకు 11 కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్
ADB: మొక్కజొన్న కొనుగోలుకు అధికారికంగా జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు పండించిన మొక్కజొన్న పంటను ప్రైవేటు కేంద్రాలలో కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని కోరారు. తేమ శాతము 14 కు మించకుండా మొక్కజొన్నను తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు.