రోడ్డు భద్రతపై పోలీసుల విస్తృత తనిఖీలు
ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రతను పెంచడం, ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా హైవేలు, ప్రధాన కూడళ్ల వద్ద బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా లైసెన్స్, హెల్మెట్, సీటు బెల్టు వంటి నియమాలు ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుని, జరిమానాలు విధించారు.