ర్యాపర్ బాద్షాపై అరెస్టు వారెంట్ జారీ

ర్యాపర్ బాద్షాపై అరెస్టు వారెంట్ జారీ

ర్యాపర్ బాద్షాను అరెస్టు చేయాలని హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది. తన తతీరీ పాటలో మహిళలను కించపరిచారనే ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి ఆయన గడువులోపు హాజరుకాలేదు. దీనిపై కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాద్షా విదేశాలకు పారిపోకుండా ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే బాద్షా ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించాడు.