పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు

GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రత్నగిరి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 54,140 నగదుతో పాటు 9 సెల్ ఫోన్లు, 1 టూ వీలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.