సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
AKP: ఎస్ రాయవరం మండలం కొత్త రేవు పోలవరం గ్రామానికి చెందిన మైలపల్లి దేవుడికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ.81,101వేలు మంజూరు అయింది. ఈ మేరకు లబ్ధిదారుడికి ఆదివారం మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, మండల తెలుగు యువత అధ్యక్షుడు కోడ లోవరాజు ,కూటమి నాయకులు కె.బంగారి, అడవి రాజు చెక్కు అందజేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైనట్లు తెలిపారు.