VIDEO: కుక్క అడ్డు రావడంతోనే ఆటో బోల్తా

KNR: తిమ్మాపూర్ మం. మన్నెంపల్లిలో ఆటోబోల్తా పడి విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మండల SI మీడియాకు వివరాలు వెల్లడించారు. విద్యార్థులను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో కుక్క అడ్డురావడంతో దానిని తప్పించబోయి ఆటోబోల్తా పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందాడని, ఐదుగురు విద్యార్థులకు స్వల్పగాయాలు అయ్యాయని పేర్కొన్నారు.