సేవాలాల్ దేవాలయ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
MBNR: హన్వాడ మండలంలోని ఎనిమిది తాండలో జరిగిన మారెమ్మయాడి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయానికి అవసరమైన నిధులు సమకూర్చి, హన్వాడ మండలంతో పాటు ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.