రూ.50 వేల కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి

రూ.50 వేల కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి

AP: వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు ఆరోగ్య కేంద్రంలో దారుణం జరిగింది. మైదుకూరుకు చెందిన బాలనారాయణ తన రెండు నెలల బిడ్డను రూ.50 వేలకు విక్రయించాడు. భార్యకు కుట్లు విప్పేందుకు ఆసుపత్రికి వచ్చి, సిబ్బంది సహకారంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తల్లి వద్ద బిడ్డను తీసేసి నగదు ఉంచి అతను పరారయ్యాడు. బాధితురాలు ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.