వంట గ్యాస్ వినియోగంపై ప్రజలకు అవగాహన
CTR: వంట గ్యాస్ వినియోగం, వినియోగదారుల భద్రత, ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో సమావేశం నిర్వహించారు. వంట గ్యాస్ సిలిండర్లు ప్రమాదాలకు గురైనప్పుడు, పేలినా, గ్యాస్ లీకేజి జరిగినా చాకచక్యంగా ఎలా వ్యవహరించాలో ప్రదర్శన చేసి చూపించారు.