దేవునిగుడి తండా సర్పంచ్ ఏకగ్రీవం
RR: కేశంపేట మండల పరిధిలోని 29 గ్రామపంచాయతీల్లో దేవునిగుడి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 28 పంచాయతీలకు 88 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 260 వార్డులకు 25 ఏకగ్రీవం కాగా, 235 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం వార్డులకు 590 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.