వెంకటగిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

వెంకటగిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

TPT: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీఐటీయూ ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజు ధర్నా నిర్వహించినట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య తెలిపారు. గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అన్నింటికీ వెంటనే జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.