'ఈ నెల 17న రిలే నిరాహార దీక్షలు చేపడతాం'
NDL: మొక్కజొన్న కేంద్రాల ఏర్పాటుకై ఈ నెల 17న రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఏపీ రైతు సంఘం, సీపీఎం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం నందికోట్కూరులోని భారత్ కాంప్లెక్స్ నందు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు పి. పక్కిర్ సాహెబ్, నాగేశ్వరావు మాట్లాడుతూ.. దేశంలో నేటికీ వ్యవసాయ రంగంపై వందకు 60% మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు.