జాతర మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
MDK: చిలిపిచేడ్ మండలం అంతారంలో ఉగాది పర్వదినాన నిర్వహించనున్న శ్రీశ్రీ పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవానికి రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని గ్రామస్థులు ఆహ్వానించారు. సోమవారం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన గ్రామ సర్పంచ్ బుర్మష్ ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.