స్క్రబ్ టైఫస్ వైరస్‌తో మహిళ మృతి
VZM: చీపురుపల్లి మండలం మెట్టపల్లిలో వైరస్ సోకి ఓ మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన చందక రాజేశ్వరి(36) టైఫాయిడ్‌గా జ్వరంతో బాధపడుతుండగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పురుగు కాటుతో స్క్రబ్ టైఫస్ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆమె పరిస్థితి విషమించి మరణించింది. దీనీపై DMHO జీవనరాణి స్పందిస్తు.. జిల్లాలో ఇలాంటి కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.