విశాఖలో ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం
VSP: బీజేపీ పిలుపు మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 ఘనంగా జరిగింది. వాసవి కళ్యాణ మండపంలో జరిగిన ఈ శిక్షణలో పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణతో కూడిన రాజకీయాలే లక్ష్యమని నేతలు పేర్కొన్నారు.